: నేటితో ముగియనున్న మున్నాభాయ్ గడువు


నేటితో మున్నాభాయ్ గడువు ముగియనుంది. 1993 ముంబై పేలుళ్ళ కేసులో అక్రమ ఆయుధాలు కలిగి ఉండడంతో టాడా చట్టం కింద అరెస్టయిన సంజయ్ దత్ కు 6 సంవత్సరాలు జైలు శిక్ష ఖరారైంది. అయితే నిందితులు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసి 6 ఏళ్ళ శిక్షను 5 ఏళ్ళకు తగ్గించుకున్నారు. ఆ దశలో 18 నెలల పాటూ జైలు జీవితం సంజూ గడిపాడు. అనంతరం బెయిలు మీద బయటకు వచ్చి పలు సినిమాలు తీసి బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయ్యాడు.

తాను పూర్తిగా మారిపోయానని, తన జైలు శిక్ష రద్దు చెయ్యాలంటూ పలుమార్లు కోర్టుకు విన్నవించుకున్నాడు సంజయ్ దత్. అయినప్పటికీ కోర్టు, చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలంటూ కోర్టులో లొంగిపోవాలని సూచించింది. దీంతో తాను నటించాల్సిన సినిమాలు కమిటై ఉన్నందున నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉందంటూ సంజయ్ దత్ పిటీషన్ దాఖలు చేసారు.

దీన్ని విచారించిన కోర్టు నాలుగు వారాల అదనపు గడువు ఇచ్చింది. ఈ గడువు నేటితో ముగియనుంది. దీంతో తాము నష్టపోకుండా ఉండేందుకు మరింత అదనపు సమయం కావాలని నిర్మాతలు పిటీషిన్ వేసారు. దీన్ని కోర్టు తోసిపుచ్చింది. దీంతో సంజయ్ తాను కోర్టులో లొంగిపోతే ఛాందసవాదుల నుంచి ప్రాణహాని ఉందని అందుకే నేరుగా పూణేలోని ఎరవాడ జైల్లో లొంగిపోతానని కోర్టుకు విన్నవించుకున్నాడు. రేపు లొంగిపోనున్నాడు

  • Loading...

More Telugu News