Maganti Rupa Devi: జగన్ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో 150 మందిపై కబ్జా, చీటింగ్ కేసులున్నాయి: మాగంటి రూపాదేవి

  • దమ్ము, ధైర్యం ఉన్న నేత చంద్రబాబు
  • అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టారు
  • మరో బీహార్ చేయాలని చూస్తున్నారు

వైసీపీ అధినేత జగన్ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో 150 మందిపై కబ్జా, చీటింగ్ కేసులున్నాయని రాజమండ్రి టీడీపీ లోక్‌సభ అభ్యర్థి రూపాదేవి విమర్శించారు. నేడు కొవ్వూరులో చంద్రబాబుతో పాటు ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూపాదేవి మాట్లాడుతూ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు.

తెలుగు జాతి గర్వించే మహానేత చంద్రబాబు అని, అంత గొప్ప నేత పక్కన నిలబడి మాట్లాడటం తనకెంతో గర్వంగా ఉందన్నారు. జగన్ నేరచరితులకు సీట్లు ఇచ్చి రాష్ట్రాన్ని మరో బీహార్ చేయాలని చూస్తున్నారని రూపాదేవి మండిపడ్డారు. చంద్రబాబు మిషన్ 150 పేరుతో పేదల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టారని రూపాదేవి కొనియాడారు.

Maganti Rupa Devi
Chandrababu
Jagan
Rajahmundry
Bihar
Andhra Pradesh
  • Loading...

More Telugu News