Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి షాక్‌...కాంగ్రెస్‌లో చేరిన పార్టీ ఎంపీ అశోక్‌కుమార్‌ దోహ్రే

  • సాదరంగా ఆహ్వానించిన రాహుల్‌గాంధీ
  • దేశంలో అతి పెద్ద రాష్ట్రం యూపీ
  • ఎన్నికల ముందు ఝలక్ తో కమలనాధుల్లో ఆందోళన

దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి గట్టి షాక్‌ తగిలింది. ఎన్నికల వేళ ఆ పార్టీ ఎంపీ ఒకరు ఝలక్ ఇచ్చారు. రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. బీహార్‌లోని పట్నాసాహిబ్‌ ఎంపీ, సినీ నటుడు శత్రుఘ్నసిన్హా ఏప్రిల్‌ 6న కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ అశోక్‌కుమార్‌ దోహ్రే  బీజేపీకి గుడ్‌బై చెప్పడంతో పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ రోజు ఆయన ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరగా, ఆయనకు కండువా వేసి రాహుల్‌ ఆహ్వానించారు.

Uttar Pradesh
sitting MP
Congress
BJP
  • Loading...

More Telugu News