modi: తెలుగులో వరుస ట్వీట్లు చేసిన ప్రధాని మోదీ

  • ఈరోజు మహబూబ్ నగర్, కర్నూలు సభల్లో ప్రసంగించనున్న మోదీ
  • ఎన్డీయే మిత్రపక్షాలను ఎందుకు ఎన్నుకోవాలో వివరిస్తానన్న ప్రధాని
  • ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కావాలంటూ విన్నపం

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఈరోజు తెలంగాణ, ఏపీల్లో పర్యటించనున్నారు. తొలుత మహబూబ్ నగర్ బహిరంగసభలో ప్రసంగించనున్న మోదీ... ఆ తర్వాత కర్నూలుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ప్రజలను ఉద్దేశించి ఆయన తెలుగులో ట్వీట్లు చేశారు.

'మహబూబ్ నగర్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలను నేటి బహిరంగసభలో పాల్గొనమని నేను ఆహ్వానిస్తున్నా. ప్రజల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించిన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి మీకు వివరంగా చెప్పదలుచుకున్నా. భారత ప్రజలంతా ఎన్డీయే మిత్రపక్షాలను తిరిగి మరోసారి ఎందుకు ఎన్నుకోవాలో, ఆశీర్వదించాలో నేను మీకు వివరించదలచుకున్నా.

ఈ సాయంత్రం కర్నూలులో ఓ ర్యాలీని ఉద్దేశించి నేను ప్రసంగిస్తాను. మహోన్నత ఎన్టీఆర్ ఆదర్శాలకు నీళ్లొదిలి, మోసపూరిత తెలుగుదేశం అవినీతి, బలహీనమైన పాలనలో ఏపీ అన్ని రంగాల్లో తిరోగమనంలో ఉంది. యువత కలలు నేరవేర్చడానికి నేను ఆంధ్రప్రదేశ్ ఆశీస్సులు కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.

modi
telugu
tweets
ap
telangana
  • Loading...

More Telugu News