Narendra Modi: మోదీ మంచోడే.. కానీ ఆయన విధానాలే మంచివి కావు: సినీ నటి ఊర్మిళ

  • కాంగ్రెస్‌లో చేరడానికి ముందే గాంధీ, నెహ్రూల గురించి పూర్తిగా తెలుసుకున్నా
  • మోదీ విధానాలతో ప్రజల్లో అసంతృప్తి
  • ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారు

రెండు రోజుల క్రితమే కాంగ్రెస్‌లో చేరిన బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ వ్యక్తిగతంగా మంచోడే కానీ, ఆయన విధానాలు మాత్రం మంచివి కావన్నారు. ఆయన విధానాల వల్ల ప్రజల్లో రోజు రోజుకు అసహనం పెరుగుతోందన్నారు. తాను కాంగ్రెస్‌లో చేరడానికి ముందే గాంధీ, నెహ్రూల గురించి పూర్తిగా చదివి తెలుసుకున్నట్టు చెప్పారు. తన కుటుంబం కాంగ్రెస్ సిద్ధాంతాలను అనుసరిస్తుందన్నారు.

ప్రస్తుతం దేశంలో పరిస్థితులు ఏమంత బాగోలేవని, అన్నింటిలోనూ మతం ప్రధానమైపోయిందని ఊర్మిళ ఆవేదన వ్యక్తం చేశారు. మతం పేరుతో దాడులు, చంపుకోవడాలు దారుణమన్నారు. ఇచ్చిన హామీలను మోదీ అమలు చేయలేకపోయారని, ఫలితంగా దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. దేశంలో సమస్యలపై పోరాడేందుకు తనకు మంచి వేదిక దొరికిందని ఊర్మిళ పేర్కొన్నారు. 

Narendra Modi
urmila matondkar
Rahul Gandhi
BJP
Congress
  • Loading...

More Telugu News