madhuri dixit: అవన్నీ పుకార్లు మాత్రమే: మాధురీ దీక్షిత్

  • లోక్ సభ ఎన్నికల్లో మాధురీ పోటీ చేయనున్నారంటూ ప్రచారం
  • తాను ఏ పార్టీలో లేనని తెలిపిన మాధురీ
  • మరో ఇద్దరిపై కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోందంటూ వ్యాఖ్య

లోక్ సభ ఎన్నికల్లో బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ వార్తలపై మాధురీ స్పందించారు. తాను ఏ పార్టీలో లేనని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాననే వార్తలు పుకార్లు మాత్రమేనని కొట్టిపడేశారు. తాను ఏ పార్టీ తరపున పోటీ చేయబోనని... ఇప్పటికే దీనికి సంబంధించి క్లారిటీని కూడా ఇచ్చానని చెప్పారు. తనతో పాటు మరో ఇద్దరు యాక్టర్లపై కూడా ఇలాంటి ప్రచారమే జరుగుతోందని అన్నారు. 1984లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన మాధురీ... స్వల్ప కాలంలోనే అగ్రస్థాయికి చేరుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.

madhuri dixit
bollywood
lok sabha
contest
  • Loading...

More Telugu News