Aravind Kejriwal: చంద్రబాబును గెలిపించి కేంద్రంలో చక్రం తిప్పేలా చేయాలి: కేజ్రీవాల్

  • మోదీ పోవాలి, చంద్రబాబు రావాలి
  • అన్ని వర్గాల వారిని ఆదుకున్నారు
  • మోదీ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టారు

ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో టీడీపీని గెలిపించి చంద్రబాబును కేంద్రంలో చక్రం తిప్పేలా ప్రజలు చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరారు. నేడు చంద్రబాబుతో కలిసి ఆయన కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ, దేశంలో ప్రధాని మోదీ పోవాలని, ఏపీలో చంద్రబాబు రావాలని అభిలషించారు. ఏపీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లగలిగిన నాయకుడు చంద్రబాబు అని కేజ్రీవాల్ కొనియాడారు.

దేశంలో ఎవరూ చేయని విధంగా ఏపీని అభివృద్ధి చేశారని, వృద్ధులు, మహిళలు, రైతులు అన్ని వర్గాల వారిని ఆదుకున్నారన్నారు. చంద్రబాబు ఎన్నో పథకాలు అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం అమలు చేశారని కేజ్రీవాల్ కొనియాడారు. మోదీ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్లారని, తన స్వార్థం కోసం కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టారన్నారు. జగన్‌కు ఓటేయడమంటే బీజేపీకి ఓటేయడమేనని ప్రజలు గుర్తించాలన్నారు.

Aravind Kejriwal
Chandrababu
Narendra Modi
Jagan
Andhra Pradesh
Krishna District
  • Loading...

More Telugu News