Telangana: సీఈఓ రజత్ కుమార్ ను కలిసిన గద్దర్

  • ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలి
  • కేంద్రంలో సెక్యులర్ పార్టీ అధికారంలోకి రావాలి
  • ప్రజాగాయకుడు గద్దర్

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ను ప్రజా గాయకుడు గద్దర్ కలిశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని రజత్ కుమార్ ని కోరారు. ‘సేవ్ కానిస్టిట్యూషన్’ పేరిట రెండేళ్లుగా తాను ఉద్యమిస్తున్నానని, కేంద్రంలో సెక్యులర్ పార్టీ అధికారంలోకి రావాలని ఈ సందర్భంగా గద్దర్ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉండగా, సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ తో గద్దర్ ఈరోజు భేటీ అయ్యారు. అంజన్ కుమార్ కు తన మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఆర్టికల్ 3 ప్రకారం ‘తెలంగాణ’ ఇచ్చిన ఢిల్లీ తల్లి సోనియాగాంధీని తప్పకుండా మనం గౌరవించాలని, 17 కు 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.  

Telangana
CEO
Rajathkumar
Gaddar
congress
  • Loading...

More Telugu News