Chandrababu: డీజీపీ ఠాకూర్ తన కాన్వాయ్ లో రూ.35 కోట్లు ప్రకాశం జిల్లాకు తరలించారు: విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణ

  • ఈసీని కలిసిన వైసీపీ నేతలు
  • ఠాకూర్ ను బదిలీ చేయాలంటూ డిమాండ్
  • కేఏ పాల్ పైనా ఫిర్యాదు

స్వతంత్ర రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని కూడా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లక్ష్యపెట్టడంలేదని, అందుకు రాష్ట్ర డీజీపీ ఠాకూర్ ప్రధాన కారకుడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో వైసీపీ నేతలు ఇవాళ ఈసీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ ఠాకూర్ పై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర డీజీపీ హోదాలో ఉన్న ఠాకూర్ తన కాన్వాయ్ లో రూ.35 కోట్లు రాజధాని అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకు తరలించారని, ఇది మార్చి 24న జరిగిందని విజయసాయి తెలిపారు.

ఈసీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఠాకూర్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఠాకూర్ ను వెంటనే బదిలీ చేయకపోతే ఎన్నికలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని విజయసాయి ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఐటీ, సీబీఐలకు ప్రవేశం లేదంటూ కొత్త భాష్యం చెబుతున్న చంద్రబాబు, ఇప్పుడు ఈసీని సైతం లెక్కలోకి తీసుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. వీళ్లకు తోడు కేఏ పాల్ కూడా తయారయ్యాడని, ప్రజశాంతి పార్టీ అధినేత డబ్బుల కోసం చంద్రబాబుకు అమ్ముడుపోయాడని ఆరోపించారు.

  • Loading...

More Telugu News