Tarakaratna: నెల్లూరు టీడీపీలో ఉత్సాహం నింపిన నటుడు తారకరత్న!

  • నెల్లూరు రూరల్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం
  • ర్యాలీ నిర్వహించిన తారకరత్న
  • సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన

ఎన్నికల వేడి రోజురోజుకూ పెరిగిపోతున్న వేళ, అధికార, ప్రతిపక్షాలు తమకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వాడుకుంటూ, ఓటర్లను తమవైపు తిప్పుకునే వ్యూహాలను రచిస్తున్నాయి. మరోసారి అధికారమే లక్ష్యంగా, తాను చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు సాగుతుండగా, ఆయనకు నందమూరి ఫ్యామిలీ నుంచి మంచి మద్దతు లభిస్తోంది.

తాజాగా, నెల్లూరు జిల్లాలో పర్యటించిన నందమూరి తారకరత్న, జిల్లా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్న అబ్దుల్ అజీజ్ కు మద్దతుగా నగరంలోని వేదాయపాలెం నుంచి గాంధీ నగర్ వరకూ ర్యాలీ నిర్వహించిన తారకరత్న, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపైనే ప్రతి ఒక్కరూ ఓటేయాలని కోరారు. 

Tarakaratna
Nellore District
Telugudesam
  • Loading...

More Telugu News