Varma: భీమవరం బరిలో నేనూ ఉన్నా... పవన్ పైనే పోటీ... మరిన్ని వివరాలు చెబుతానన్న రామ్ గోపాల్ వర్మ!

  • నామినేషన్ల గడువు ముగిసింది
  • నాకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి
  • చర్చనీయాంశమైన వర్మ ట్వీట్లు

తాను తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీని కల్పించడంలో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ, తాజాగా, రెండు ఆసక్తికర ట్వీట్లు చేశారు. తాను ఎన్నికల బరిలో ఉన్నానని, పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న భీమవరం నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. నామినేషన్లకు గడువు ముగిసినా, తనకు ఉన్నతాధికారుల నుంచి పోటీ చేసేందుకు అనుమతి లభించిందని చెప్పారు. మరిన్ని వివరాల కోసం వేచి చూడాలని అన్నారు. ఈ ట్వీట్లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. కాగా, కాసేపు వార్తల్లో ఉండేందుకు, ఫ్యాన్స్ తన గురించి మాట్లాడుకునేందుకు వర్మ ఈ ట్వీట్లు చేసినట్టు భావిస్తున్నారు.






Varma
Pawan Kalyan
Bhimavaram
Contest
  • Loading...

More Telugu News