Jagan: పాలకొల్లుకు వచ్చిన జగన్... భవంతులపై పోలీసుల కాపలా!

  • పాలకొల్లులో పర్యటించిన జగన్
  • భవంతులపైకి ప్రజలను అనుమతించని పోలీసులు
  • నిన్నటి ప్రమాదం నేపథ్యంలో ఆంక్షలు

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఈ ఉదయం జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జగన్ రాక సందర్భంగా పాలకొల్లు ప్రధాన కూడలి జనసంద్రమైంది. అయితే, నిన్న ఓ భవంతి గోడ కూలి ఇద్దరు మరణించిన నేపథ్యంలో, జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఈ ఉదయం పాలకొల్లులో ఏ ఒక్కరినీ భవంతులపైకి ఎక్కనీయలేదు. చుట్టుపక్కల ఉన్న అన్ని భవనాలపైనా పోలీసులు కాపలాగా నిలబడి, ఎవరినీ బిల్డింగ్ లపైకి ఎక్కేందుకు అనుమతించలేదు.

ఈ సభలో జగన్ మాట్లాడుతూ, తాను పాదయాత్ర సందర్భంగా పాలకొల్లు మీదుగానే నడిచానని, నాడు ప్రజలు చెప్పిన అన్ని సమస్యలు, బాధలు తనకింకా గుర్తున్నాయని, అన్ని సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తున్నానని అన్నారు. పక్కనే గోదావరి నది ఉన్నా, రెండో పంటకు నీరు లభించని పరిస్థితిలో పాలకొల్లు రైతులు ఉన్నారన్న సంగతి తనకు తెలుసునని, మూడో పంటకు సైతం నీరు వచ్చేలా చూస్తానని అన్నారు.

Jagan
Palakollu
police
Building
  • Loading...

More Telugu News