Chittoor District: సైకిలెక్కుదామనుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చెంగారెడ్డి...వద్దన్న అనుచరులు

  • కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారం సాధిస్తుందన్నవ్యాఖ్యలు
  • రాహుల్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని నమ్మకం
  • దీంతో మనసు మార్చుకున్న నగరి నాయకుడు

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు రెడ్డివారి చెంగారెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలన్న ప్రయత్నాన్ని ఆయన అనుచరులు అడ్డుకున్నారు. పార్టీ మారితే బాగుంటుందన్న ఉద్దేశంతో నిన్న నగరిలోని సాయిదివ్యధామం మందిరంలో అనుచరగణంతో సమావేశమయ్యారు. తన మనసులోని మాట చెప్పి అభిప్రాయం సేకరించిన చెంగారెడ్డికి ఊహించని విధంగా వ్యతిరేకత వ్యక్తమైంది. కాంగ్రెస్‌ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారని, అందువల్ల  కాంగ్రెస్‌లోనే కొనసాగుదామని ఎక్కువ మంది చెప్పడంతో చెంగారెడ్డికి మనసు మార్చుకోక తప్పలేదు. దీంతో ఆయన అనుచరుల మాటకే ఓకే అంటూ సమావేశాన్ని ముగించారు. 

Chittoor District
Nagri constituency
chengareddy
Congress
Telugudesam
  • Loading...

More Telugu News