Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ కోరితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తా: ప్రియాంక గాంధీ వాద్రా

  • నాకైతే పోటీచేయాలని లేదు
  • పార్టీ కోసం పనిచేయాలని ఉంది
  • ఉద్యోగావకాశాలు కల్పించడంలో మోదీ విఫలం

తాజా ఎన్నికల్లో పోటీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (తూర్పు యూపీ) ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. పార్టీ అధిష్ఠానం కోరితే లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. ‘‘తప్పకుండా పోటీ చేస్తా’’ అని పేర్కొన్నారు. నిజానికి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగాలని తనకు లేదని, పార్టీ కోసం పనిచేయాలని మాత్రమే ఉందన్నారు. అయితే, పార్టీ కోరితే మాత్రం ఎన్నికల బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు.

తన సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీలో బుధవారం ప్రచారం నిర్వహించిన ప్రియాంక మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ పార్టీ కోరితే మాత్రం పోటీకి నేను రెడీ’’ అని పేర్కొన్నారు. ఉద్యోగావకాశాలు కల్పించడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని ఆరోపించిన ప్రియాంక.. కాంగ్రెస్ చీఫ్ ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై బీజేపీ, మాయావతి విమర్శలు చేయడంపై మండిపడ్డారు.

Priyanka Gandhi Vadra
Lok Sabha elections
Congress
Uttar Pradesh
  • Loading...

More Telugu News