Andhra Pradesh: ఓ పక్క చెల్లెళ్లు, మరోపక్క తమ్ముళ్లు..నేనెంత అదృష్టవంతుడిని!: సీఎం చంద్రబాబు

  • అనంతపురంలో చంద్రబాబు రోడ్ షో
  • రాజకీయ కుట్రలను మనం కలిసికట్టుగా తిప్పికొట్టాలి
  • మోదీ మొండిచేయి చూపినా వెనక్కి తగ్గలేదు

ఓ పక్క చెల్లెళ్లు, మరోపక్క తమ్ముళ్లతో నిండిపోయారని, తాను ఎంతో అదృష్టవంతుడినంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతోషం వ్యక్తం చేశారు. అనంతపురంలో నిర్వహిస్తున్న రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, రాజకీయ కుట్రలను మనందరం కలిసికట్టుగా తిప్పికొట్టాలని సూచించారు. హైదరాబాద్ లాంటి నగరాలు ఇరవై అయినా నిర్మించుకోవచ్చు కానీ, ఆత్మగౌరవం పోతే సహించలేమని అన్నారు. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ, మనసుంది, సత్తా ఉందని, కేంద్రం మోసం చేసినా, మోదీ మొండిచేయి చూపినా వెనక్కి తగ్గలేదని అన్నారు. శక్తి సామర్థ్యాలతో రాజధాని, పోలవరం ప్రాజెక్టులను కట్టుకోవడమే కాదు, వేలాది పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చామని అన్నారు. 

Andhra Pradesh
Ananthapuram
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News