Jagan: జగన్ సభలో గోడ కూలిన ప్రమాదంలో ఒకరి మృతి, మరో నలుగురి పరిస్థితి విషమం

  • భారీ సంఖ్యలో హాజరైన జనం
  • పిట్టగోడ కూలడంతో ప్రమాదం
  • వైసీపీ శ్రేణుల్లో విషాదం

వైసీపీ అధినేత జగన్ సభలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఆయన నేడు ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. సభా ప్రాంగణం జనసంద్రమవడంతో భవనాలు, గోడలపై జనాలు నిలబడ్డారు.

ఒక్కసారిగా గోడ కూలడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పిల్లి రాములమ్మ అనే మహిళా కార్యకర్త చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను జగన్ పరామర్శించారు.

Jagan
East Godavari District
Mandapeta
YSRCP
Pilli Ramulamma
  • Loading...

More Telugu News