nama nageswar rao: నామా నాగేశ్వరరావును చూస్తుంటే జాలి కలుగుతోంది: రేణుకా చౌదరి

  • కేసీఆర్ ను ఎదుర్కోవడానికి నేనొక్కదానిని చాలు
  • ఎమ్మెల్యేల కొనుగోలు కోసం కేంద్రాలను తెరిచారు
  • చౌకీదార్ ఉద్యోగానికి కూడా మోదీ పనికిరారు

ఖమ్మం లోక్ సభ టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును చూస్తుంటే తనకు జాలి కలుగుతోందని కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. రెండు కారణాల వల్ల నామా టీఆర్ఎస్ లో చేరి ఉండవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోవడానికి ఎవరూ అవసరం లేదని... తానొక్కదానిని చాలని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం కేసీఆర్ కొనుగోలు కేంద్రాలను తెరిచారని విమర్శించారు. ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా ఆమె విరుచుకుపడ్డారు. ప్రధాని పదవికే కాదు... చౌకీదార్ ఉద్యోగానికి కూడా ఆయన పనికిరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

nama nageswar rao
renuka chowdary
kcr
modi
congress
bjp
TRS
  • Loading...

More Telugu News