urmila matondkar: ఊర్మిళను సాదరంగా ఆహ్వానించిన రాహుల్ గాంధీ

  • కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీ నటి ఊర్మిళ
  • ముంబై నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం
  • బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఊర్మిళ

ప్రముఖ సినీనటి ఊర్మిళ మతోండ్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఓ పుష్పగుచ్ఛాన్ని అందించి ఊర్మిళను పార్టీలోకి రాహుల్ సాదరంగా ఆహ్వానించారు. 45 ఏళ్ల ఊర్మిళను ముంబై నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించే అవకాశాలు ఉన్నాయి.

ఈ సందర్భంగా ఊర్మిళ మాట్లాడుతూ, ప్రత్యక్ష రాజకీయాల దిశగా ఇది తన తొలి అడుగని చెప్పారు. ఎంతో సామాజిక చైతన్యం, బలమైన రాజకీయ సిద్ధాంతాలు ఉన్న కుటుంబం నుంచి తాను వచ్చానని తెలిపారు. గాంధీ, నెహ్రూ, పటేల్ ల సిద్ధాంతాలను తమ కుటుంబం ఆచరిస్తుందని చెప్పారు. విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చినా... తాను సినీ రంగంవైపు మొగ్గు చూపానని అన్నారు. అయినా, చిన్నతనం నుంచి తనకు సామాజిక అంశాల పట్ల ఎంతో అవగాహన ఉందని చెప్పారు.

1980లో బాల నటిగా ఊర్మిళ సినీ రంగ ప్రవేశం చేశారు. 1995లో రామ్ గోపాల్ వర్మ చిత్రం 'రంగీలా'తో ఆమె బాలీవుడ్ ను ఒక ఊపు ఊపారు. తెలుగులో కూడా పలు చిత్రాలలో ఆమె నటించారు.

urmila matondkar
congress
bollywood
rahul gandhi
  • Loading...

More Telugu News