: పందెంలో ఓడి 13 ఏళ్ల సోదరుడిని హతమార్చి..
దక్షిణ ముంబైకి చెందిన 13 ఏళ్ల బాలుడు ఆదిత్యను ఐపిఎల్ బెట్టింగ్ బలితీసుకుంది. ఆదిత్యను స్వయానా అన్న అయిన హిమాన్షు హతమార్చాడు. హిమాన్షు ఐపిఎల్ బెట్టింగ్ లో 10 లక్షలు నష్టపోయాడు. వాటిని భర్తీ చేసుకోవడం కోసం స్వయానా తమ్ముడైన ఆదిత్యను స్నేహితుడితో కలిసి కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆదిత్య తల్లిదండ్రులకు ఫోన్ చేసి 30లక్షలు ముట్టజెప్పాలని డిమాండ్ చేశాడు. ఇది హిమాన్షు పనేనని ఆదిత్య తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో హిమాన్షు ఆదిత్య ఒంటికి నిప్పంటించి అంతమొందించాడు. హిమాన్షు, అతడికి సహకరించిన స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.