Chandrababu: పోలీసు అధికారుల బదిలీపై తాడోపేడో...ఈసీకి లేఖ పంపిన చంద్రబాబు

  • ఢిల్లీ చేరుకున్న కనకమేడల, జూపూడి
  • లేఖ అందజేశాక స్పందనబట్టి నిర్ణయం
  • అవసరమైతే న్యాయపోరాటం

పోలీసు అధికారుల బదిలీపై ఆగ్రహంతో ఊగిపోతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఈసీతో తాడుపేడో తేల్చుకుంటామంటున్నారు. ఈసీ చర్యపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ బుధవారం లేఖ రాశారు. ఈ లేఖను పట్టుకుని పార్టీ నాయకులు జూపూడి ప్రభాకరరావు, కనకమేడల రవీంద్రకుమార్‌లు ఇప్పటికే  ఢిల్లీ చేరుకున్నారు. ఎన్నికల అధికారులకు లేఖ అందించాక వారి స్పందన బట్టి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. సరైన స్పందన లేకుంటే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈరోజు మధ్యాహ్నం ఎన్నికల అధికారులతో టీడీపీ నేతలు భేటీ అయి లేఖ అందించే అవకాశం ఉంది.

Chandrababu
EC
police officers
New Delhi
  • Loading...

More Telugu News