Telangana: మల్కాజిగిరిలో మొత్తం 40 నామినేషన్లు... 27 తిరస్కరణ!
- వివిధ కారణాలతో నామినేషన్ల తిరస్కరణ
- బరిలో మిగిలింది 13 మంది
- రేవంత్, మర్రి, రాంచదర్ రావుల మధ్య ప్రధాన పోటీ
తెలంగాణలోని అతిపెద్ద లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన మల్కాజిగిరిలో రిటర్నింగ్ అధికారులు 27 మంది నామినేషన్లు తిరస్కరించారు. మొత్తం 40 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, నిబంధనల మేరకు నామినేషన్లు, అఫిడవిట్లు లేవంటూ 27 మంది వేసిన నామినేషన్లను తిరస్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దీంతో మల్కాజిగిరి బరిలో చివరకు 13 మంది మిగిలారు. వీరిలో కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, బీజేపీ నుంచి ఎన్ రాంచందర్ రావులు ప్రధానంగా పోటీ పడుతున్నారు.
వీరితో పాటు ప్రజాసత్తా నుంచి ధర్మాసనం భానుమూర్తి, ఇండియా ప్రజాబంధు పార్టీ నుంచి బురు బాలమణి, జనసేన నుంచి మహేందర్రెడ్డి, సోషల్ జస్టీస్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి చామకూర రాజయ్యలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా సీహెచ్ చంద్రశేఖర్, ఇందూరం తిరుపతయ్య, దొంతుల భిక్షపతి, పంబాల శివరాజ్, పొన్నాల రాజేందర్, గోనే సాయికిరణ్ లు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు వుండటంతో, వీరిలో ఎవరు మిగులుతారన్న విషయం రేపు తేలుతుంది.