Chandrababu: జగన్ తనను సీఎం చేస్తే కాంగ్రెస్’కు రూ.1500 కోట్లు ఇస్తామన్నారు: ఫరూక్ అబ్దుల్లా ఆరోపణ

  • వైఎస్ మరణించాక సీఎం కావాలని జగన్ భావించారు
  • జగన్ కు అంత డబ్బు ఎక్కడిది?
  • ఇలాంటి వ్యక్తితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక సీఎం కావాలని జగన్ భావించారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. కడప జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఫరూక్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ మృతి చెందాక తనను సీఎం చేస్తే కాంగ్రెస్’కు రూ.1500 కోట్లు ఇస్తానని జగన్ చెప్పినట్టు ఆయన ఆరోపించారు. జగన్ కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని, ఇలాంటి వ్యక్తితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్ తన భవిష్యత్తును చక్కదిద్దుకుని ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Chandrababu
Faruk abdullah
cuddapah
jagan
  • Loading...

More Telugu News