: ఆకాశవాణి కేంద్రంలో లైంగిక వేధింపులు
విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో న్యూస్ రీడర్ దుర్గారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. అదే కేంద్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న మరో న్యూస్ రీడర్ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో ఈ కేసు దాఖలు చేశారు. లైంగికంగా వేధిస్తున్నాడని, విధి నిర్వహణలో మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు.