Andhra Pradesh: టీడీపీ తరపున ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలు

  • టీడీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం
  • ఇప్పటికే ప్రచారంలో పాల్గొన్న ఫరూక్ అబ్దుల్లా
  • ఈ నెల 28న విజయవాడకు కేజ్రీవాల్

ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ఏపీలో టీడీపీ తమ ప్రచారం ముమ్మరం చేసింది. ఈ ప్రచారంలో పాల్గొనేందుకు జాతీయ స్థాయి నేతలు కూడా హాజరుకానున్నారు. దాదాపు పది మంది అగ్రనేతలు టీడీపీ తరపున ఎన్నికల ప్రచారాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కడపలో చంద్రబాబుతో కలిసి ఈరోజు ప్రచారంలో పాల్గొన్నారు.

ఇక పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, జేడీఎస్ అధినేత దేవెగౌడ, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ తదితరులు ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 28న విజయవాడకు కేజ్రీవాల్, 31న విశాఖకు మమతా బెనర్జీ లు రానున్నారు. ఆయా చోట్ల నిర్వహించే బహిరంగసభల్లో పాల్గొననున్నారు. వచ్చే నెల 2వ తేదీన నెల్లూరులో నిర్వహించే బహిరంగ సభకు సమాజ్ వాదీ పార్టీ అగ్ర నేత అఖిలేశ్ యాదవ్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది.

Andhra Pradesh
Telugudesam
Election
Campaign
cuddapah
AAp
Kejriwal
Trinamul congress
  • Loading...

More Telugu News