Urmila Matondkar: నటి ఊర్మిళా మతోండ్కర్ కు ముంబై నుంచి కాంగ్రెస్ టికెట్!

  • ముంబై నార్త్ నుంచి బరిలోకి దింపే ఆలోచన
  • ఆమె పేరును పరిశీలిస్తున్నామన్న కాంగ్రెస్
  • ఇంకా స్పందించని ఊర్మిళ కుటుంబం

బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ కు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ టికెట్ ను ఆఫర్ చేస్తూ, ముంబై నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది. ఈ విషయాన్ని పార్టీ నేత ఒకరు వెల్లడించారు. ముంబై నార్త్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఈ 'రంగీలా' సుందరిని నిలపాలని కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విషయంలో ఊర్మిళ కుటుంబం ఇంకా స్పందించలేదు. ఆమె పేరును పార్టీ నాయకత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం సాధ్యమైనంత త్వరగా తీసుకుంటామని పార్టీ నేతలు అంటున్నారు. ముంబై పరిధిలోని ఆరు నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరుగనుంది. ఒకవేళ ఊర్మిళకు టికెట్ లభిస్తే, ఆమె బీజేపీ నేత గోపాల్ శెట్టిపై పోటీ చేయాల్సి వస్తుంది.

Urmila Matondkar
Mumbai North
Congress
Ticket
  • Loading...

More Telugu News