Elections: ఏపీలో 175 స్థానాలకు 3,279 నామినేషన్లు... గుంటూరు జిల్లాలో అత్యధికం!

  • ముగిసిన నామినేషన్ల ఘట్టం
  • విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 111 నామినేషన్లు
  • 25 లోక్ సభ స్థానాలకు 472 నామినేషన్లు

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3,279 మంది నామినేషన్లు వేశారు. గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలకు అత్యధికంగా 370 మంది నామినేషన్లు వేశారు. విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 111 నామినేషన్లు వచ్చాయి.

 సగటున ఒక్కో నియోజకవర్గానికి 19 మంది పోటీ పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా 146 మంది, విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా 245, తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలుండగా 219, పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలుండగా 244 మంది నామినేషన్లు వేశారు. 16 అసెంబ్లీ నియోజకవర్గాలున్న కృష్ణా జిల్లాలో 353, 12 నియోజకవర్గాలున్న ప్రకాశం జిల్లాలో 236 నామినేషన్లు వచ్చాయి.

నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 129, చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 287, అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 288, కడప జిల్లాలో 10 నియోజకవర్గాలుండగా 217, కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 334 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

లోక్‌ సభ విషయానికి వస్తే, 25 స్థానాలకు గాను 472 మంది నామినేషన్‌ వేశారు. అత్యధికంగా నంద్యాల నుంచి 36 మంది పోటీ పడుతుండగా, అనంతపురం నుంచి 23 మంది బరిలో ఉన్నారు.

Elections
Andhra Pradesh
Nominations
  • Loading...

More Telugu News