Rahul Gandhi: రాహుల్‌కి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న స్మృతి ఇరానీ!

  • వెనక్కి తగ్గని స్మృతి
  • రాహుల్ వయనాడు నుంచి కూడా పోటీ
  • గట్టి పోటీ ఇస్తామంటున్న శ్రీధరన్

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎక్కడ నుంచి బరిలోకి దిగితే తాను అక్కడి నుంచి బరిలోకి దిగుతానని ప్రకటించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. అమేథీతోపాటు రాహుల్ కేరళలోని వయనాడు నుంచి పోటీ చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. స్మృతి కూడా ఆయా స్థానాల్లో పోటీకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ రాహుల్ వయనాడు నుంచి బరిలోకి దిగితే ఆ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై తెలిపారు. రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేస్తే తమ నుంచి గట్టి పోటీ ఎదుర్కోక తప్పదన్నారు. ఒకవేళ రాహుల్‌ కేరళ నుంచి పోటీకి దిగితే.. స్మృతి ఇరానీ తెలిపిన ప్రకారం తానే పోటీకి దిగుతుందో.. మరెవరినైనా నిలబెడతారో వేచి చూడాలి.

Rahul Gandhi
Smruthi Irani
Kerala
Amethi
Sridharan Pillai
  • Loading...

More Telugu News