Visakhapatnam District: మీ కుయుక్తులకు అడ్డుకట్ట వేయకపోతే, నా పేరు పవన్ కల్యాణే కాదు: చంద్రబాబు-జగన్ లకు పవన్ ఛాలెంజ్

  • నన్ను ఓడించాలని టీడీపీ, వైసీపీ, బీజేపీల యత్నం
  • కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నాయి
  • ఇది 2009 కాదు 2019, తేల్చుకుందాం రండి!

విశాఖపట్టణంలోని గాజువాక, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న తనను ఓడించాలని టీడీపీ, వైసీపీ, బీజేపీలు కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు, జగన్ లకు ఒకటే చెబుతున్నానని, ‘ఇది 2009 కాదు 2019. చూసుకుందాం, తేల్చుకుందాం రండి. మీరు ఏ కుయుక్తులు పన్నుతారో, ఆ కుయుక్తులకు అడ్డుకట్ట వేయకపోతే, నా పేరు పవన్ కల్యాణ్ కాదు’ అని ఉద్వేగ ప్రసంగం చేశారు.

Visakhapatnam District
Gajuvaka
West Godavari District
Bhimvaram
Janasena party
Pawan Kalyan
YSRCP
  • Loading...

More Telugu News