Andhra Pradesh: నన్నేమీ చేయలేక మహేశ్ బాబుపై ఐటీ దాడులు చేశారు: గల్లా జయదేవ్

  • గల్లా ఎంపీగా చేసిన అభివృద్ధిపై పుస్తకం విడుదల
  • గుంటూరులో చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రస్తావన
  • నాపై ఆరోపణలు చేసేవారు బహిరంగ చర్చకు రావాలి

తెలుగు రాష్ట్రాల్లో అధికశాతం పన్ను చెల్లింపుదారుగా ఉన్న తనను ఏమీ చేయలేక తన బావమరిది, ప్రముఖ హీరో మహేశ్ బాబుపై ఐటీ దాడులు చేశారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. ఎంపీగా ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ ఓ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ, మిర్చి, పసుపు మద్దతు ధర కోసం లోక్ సభలో మాట్లాడానని, దుగ్గిరాలలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరిన విషయాలను ప్రస్తావించారు. గుంటూరు భూగర్భ డ్రైనేజీ కోసం రూ.903 కోట్లు ఖర్చు చేశామని, ఆరోపణలు చేసేవారు ఎవరైనా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

ప్రధానిని ఎదిరించి మాట్లాడానని, దీంతో, వెంటనే తనకు ఈడీ నోటీసులు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. తనపై ఆదాయపన్ను దాడులు చేస్తామని బెదిరించారని, పన్నులు సరిగా కట్టడం వల్ల తన వైపు రాలేకపోయారని అన్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారో వైసీసీ నాయకుడు మోదుగుల చెప్పాలని డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News