Galla Jayadev: మోదుగులకు అక్కడ మాటల్లేవు.. ఇక్కడ చేతల్లేవు: గల్లా జయదేవ్ దెప్పిపొడుపు

  • మైక్ పట్టుకుని ఘనకార్యంలా ఫీలవుతుంటారు
  • మోదీని ప్రశ్నించిన వెంటనే ఈడీ నోటీసులు
  • మోదీతో పోరాడి జైలుకు వెళ్లేందుకు సిద్ధం

వైసీపీ లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికి పార్లమెంటులో మాటల్లేవని, తన నియోజకవర్గంలో చేసిన పనులు లేవని గుంటూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ విమర్శించారు. నేడు గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన నియోజకవర్గం అభివృద్ధిపై పుస్తకం విడుదల చేశారు. ఐదేళ్లలో తాను ఏం చేశాననే దాన్ని ప్రజల ముందుంచానని తెలిపారు.

అదే సమయంలో మోదుగుల గురించి మాట్లాడుతూ, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయనేం సాధించారో తెలపాలని సవాల్ చేశారు. పార్లమెంట్‌లో మైక్ పట్టుకుని అదేదో ఘనకార్యంలా ఫీలవుతుంటారని విమర్శించారు. మోదుగులకు అక్కడ మాటల్లేవని, ఇక్కడ చేతల్లేవని విమర్శించారు. తాను పార్లమెంటులో ప్రధాని మోదీని ప్రశ్నించిన వారంలోపే తనకు ఈడీ నోటీసులు పంపించిందన్నారు. హిట్లర్ వంటి మోదీతో పోరాడి తాను జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని జయదేవ్ పేర్కొన్నారు.

Galla Jayadev
Venugopal Reddy
Guntur
Narendra Modi
ED
Hitler
  • Loading...

More Telugu News