Andhra Pradesh: ఏపీ ఓటర్ల జాబితాలో తీసివేతలు 1,41,823

  • మొత్తం ఓటర్లు 3,93,12,192
  • తూర్పుగోదావరిలో అత్యధికంగా 42,04,436 మంది
  • తుదిజాబితాలో పేర్కొన్న ఎన్నికల సంఘం

ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుదిజాబితా విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రం మొత్తమ్మీద 3,93,12,192 మంది ఓటర్లు ఉన్నట్టు పేర్కొంది. జనవరి 1 తర్వాత కొత్తగా నమోదైన ఓటర్ల సంఖ్య 25, 20,924 మంది అని, జనవరి 1 తర్వాత ఓటర్ల జాబితా నుంచి తీసివేతలు 1,41,823 అని తుదిజాబితాలో నివేదించారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 42,04,436 మంది ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. అదే సమయంలో విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 18,18,016 మంది ఓటర్లు ఉన్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.

  • Loading...

More Telugu News