jc diwakar reddy: గుంతకల్లు జనసేన అభ్యర్థితో జేసీ రహస్య మంతనాలు

  • గుంతకల్లుకు చాలా సైలెంట్ గా వెళ్లిన జేసీ
  • ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ తో చర్చ 
  • జనసేన అభ్యర్థి మధుసూదన్ తో రహస్య చర్చలు

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ తో రహస్య చర్చలు జరిపారు. నిన్న మధ్యాహ్నం గుంతకల్లుకు ఎలాంటి ఆర్భాటం లేకుండా, చాలా సైలెంట్ గా జేసీ వచ్చారు. ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ నివాసానికి తొలుత ఆయన వెళ్లారు. మిగిలిన అందరినీ బయటకు పంపి... జితేందర్ గౌడ్, ఆయన సోదరుదు శ్రీనాథ్ గౌడ్ లతో అరగంట సేపు రహస్యంగా చర్చలు జరిపారు. ఎన్నికల్లో పూర్తి సహాయసహకారాలు అందిస్తానని... పార్టీ అభ్యర్థులందరూ గెలుపొందాలని చెప్పారు.

అనంతరం మార్కెట్ యార్డ్ కార్యాలయానికి వెళ్లి, జనసేన అభ్యర్థి మధుసూదన్ ను పిలిపించి రహస్య చర్చలు జరిపారు. అనంతరం మున్సిపర్ ఛైర్ పర్సన్ కోడెల అపర్ణ ఇంటికి వెళ్లి, విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపుకోసం పని చేయాలని సూచించారు. జేసీ రహస్య పర్యటన గుంతకల్లులో చర్చనీయాంశంగా మారింది. 

jc diwakar reddy
guntakal
Telugudesam
janasena
  • Loading...

More Telugu News