suryakantham: నిహారిక కోసం ఒక అన్నలా వచ్చా: విజయ్ దేవరకొండ

  • నిన్న హైదరాబాదులో 'సూర్యకాంతం' ప్రీరిలీజ్ ఫంక్షన్
  • ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ
  • నాగబాబు గారు లేని సమయంలో పెద్దన్నలా వచ్చానన్న విజయ్

కొణిదెల నిహారిక నటించిన 'సూర్యకాంతం' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇటీవల హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ, నాగబాబు గారు లేని సమయంలో నిహారికకు పెద్దన్నగా తాను ఈ ఫంక్షన్ కు వచ్చానని చెప్పాడు. రామ్ చరణ్, వరుణ్ తేజ్ లు కూడా తమ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్నారని తెలిపారు. పెద్దన్నలా తాను వచ్చానని విజయ్ చెప్పడంతో... నిహారిక ఎంతో ఆనందానికి గురయ్యారు. విజయ్ కు థ్యాంక్స్ చెప్పారు. 'సూర్యకాంతం' సినిమా మార్చ్ 29న విడుదల కానుంది.

suryakantham
movie
vijay devarakonda
niharika
  • Loading...

More Telugu News