Pawan Kalyan: ఏమా సింప్లిసిటీ!.. వైరల్ అవుతున్న పవన్ లంచ్ బ్రేక్ వీడియో!

  • ఎన్నికల శంఖారావంలో పవన్ కాసేపు విశ్రాంతి
  • మట్టిగిన్నెలో భోజనం
  • వేపచెట్టు కింద విశ్రాంతి

నెట్టింట ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు చెందిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలో పర్యటించిన జగన్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. జగన్, చంద్రబాబులపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మంగినపూడి లైట్ హౌస్ వద్ద కాసేపు విశ్రాంతి తీసుకున్న పవన్.. తాటి చాపపై కూర్చుని మట్టి ముంతలో జొన్న అన్నం తిని, కాసేపు సేద తీరారు. పంచెకట్టులో వేపచెట్టు కింద కూర్చుని జొన్న అన్నం తింటున్న పవన్ వీడియో, ఫొటోలను జనసేన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. పవన్ సింప్లిసిటీకి ఇది నిలువెత్తు నిదర్శనమంటూ ఆయన అభిమానులు ఆకాశానికెత్తేస్తున్నారు.

Pawan Kalyan
Krishna District
Manginapudi beach
lunch break
  • Error fetching data: Network response was not ok

More Telugu News