Yash Chopra: ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందంటూ బాలీవుడ్ నిర్మాత కుమారుడి ట్వీట్

  • నా పరిస్థితి ఏమంత బాగోలేదు
  • ప్రతిసారీ ఓడిపోతున్నా
  • నా ట్విట్టర్ ఖాతాను డీయాక్టివేట్ చేశాను

ప్రముఖ హిందీ చిత్రాల నిర్మాత కుమారుడు తన పరిస్థితేమీ బాగోలేదని, ఆత్మహత్య చేసుకుంటానంటూ చేసిన ట్వీట్ బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. యశ్‌రాజ్ ఫిలింస్ అధినేత యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా ఈ ట్వీట్లను చేశారు. ఆయన చేసిన ట్వీట్లతో నెటిజన్లు కంగారుపడ్డారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ సూచిస్తున్నారు.

‘‘మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, నా పరిస్థితి ఏమంత బాగోలేదు. ప్రయత్నిస్తున్న ప్రతిసారీ ఓడిపోతూనే ఉన్నా. నా ట్విట్టర్ ఖాతాను కూడా కొన్ని గంటలపాటు డీయాక్టివేట్ చేశాను. ఎందుకో చావుకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఆత్మహత్యకు ఇదే సరైన సమయమని అనిపిస్తోంది’’ అని ఉదయ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు 'తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సార్' అంటూ సూచిస్తున్నారు. అనంతరం ఉదయ్ తన ట్వీట్‌ను డిలీట్ చేసినప్పటికీ నెటిజన్లు స్క్రీన్ షాట్లు తీయడంతో ట్వీట్ వైరల్ అయింది.

Yash Chopra
Bollywood
Uday Chopra
Twitter
  • Loading...

More Telugu News