Ponguleti Srinivasa Reddy: శీనన్నా.. నీకు అన్యాయం జరిగిందంటూ అనుచరుల ఆవేదన.. కన్నీటి పర్యంతమైన ఎంపీ పొంగులేటి!

  • తొలిసారిగా ఖమ్మం వచ్చిన పొంగులేటి
  • క్యాంపు కార్యాలయానికి చేరుకున్న అనుచరులు
  • తీవ్ర ఆవేదనకు లోనైన అనుచరులు

అనుచరులను ఓదారుస్తూ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. కేసీఆర్ టికెట్ నిరాకరించిన అనంతరం తొలిసారిగా ఆయన ఖమ్మంకు వచ్చారు. ఆయన వచ్చిన విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలు భారీగా పొంగులేటి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.

పొంగులేటిని చూడగానే అనుచరులంతా కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఓదారుస్తూ పొంగులేటి కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. శీనన్నా.. నీకు అన్యాయం జరిగిందంటూ అనుచరులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయాలంటూ కోరారు. జై శీనన్న నినాదాలతో పొంగులేటి క్యాంపు కార్యాలయం మారుమోగింది.

Ponguleti Srinivasa Reddy
KCR
Khammam
Camp Office
  • Loading...

More Telugu News