Vivekananda Reddy: వివేకా హత్యతో జగన్ క్యారెక్టర్ ఏంటో తేలిపోయింది: బైరెడ్డి

  • జగన్ నాయకత్వాన్ని అసహ్యించుకుంటున్నారు
  • సెల్ఫ్ గోల్ చేసుకోవటం జగన్‌కు అలవాటు
  • మోదీ వస్తే ఏపీపై మరింత కక్ష సాధిస్తారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యతో వైసీపీ అధినేత జగన్ క్యారెక్టర్ ఏంటో తేలిపోయిందని టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ నాయకత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ప్రతిసారీ ఎన్నికలకు ముందు సెల్ఫ్ గోల్ చేసుకోవడం జగన్‌కు అలవాటేనన్నారు. మోదీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏపీపై మరింత కక్ష సాధించటం ఖాయమన్నారు. ఏపీని వేధిస్తున్న మోదీ, కేసీఆర్‌తో జగన్ జతకట్టడం సిగ్గుచేటని, ఈ కారణంగా జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని బైరెడ్డి విమర్శించారు.

Vivekananda Reddy
Byreddy Rajasekhar Reddy
Jagan
YSRCP
Narendra Modi
KCR
  • Loading...

More Telugu News