cuddapah: వైఎస్ వివేకాను చంపేస్తే రక్తాన్ని కడగడానికి మాత్రమే అవినాశ్ రెడ్డి పనికొచ్చాడు!: చంద్రబాబు

  • కడపకు అవినాశ్ రెడ్డి ఏం పనులు చేశాడో!
  • హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులకు ఓటేయొద్దు
  • వైసీపీ తోక కట్ చేస్తా, వదిలిపెట్టను

కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బద్వేలులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, కడపకు ఎంపీగా అవినాశ్ రెడ్డి ఏం పనులు చేశాడో గానీ, వైఎస్ వివేకానందరెడ్డిని చంపేస్తే అక్కడి రక్తాన్ని కడగడానికి మాత్రం పనికొచ్చాడని ఘాటుగా విమర్శించారు. హత్యా రాజకీయాలకు సహకరిస్తున్న వ్యక్తులకు ఓటు వేయొద్దని సూచించారు.

 ఈ సందర్భంగా సాక్షి పేపర్, ఛానెల్ పై ఆయన విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకుడు రాజశేఖర్ పోటీ నుంచి తప్పుకుంటున్నాడని తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే హింస చెలరేగుతుందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో వయోలెన్స్ చేయాలని చూస్తే మీ తోక కట్ చేస్తా, వదిలిపెట్టను జాగ్రత్త అని వైసీపీ నేతలను హెచ్చరించారు.

cuddapah
Budvel
Telugudesam
Chandrababu
avinash reddy
YSRCP
Ys
jagan
sakshi
  • Loading...

More Telugu News