cuddapah: పెద్ద పెద్ద మాటలు చెప్పిన జగన్ కనపడడే?: సీఎం చంద్రబాబు

  • ‘ఢిల్లీకి, కడప పౌరుషానికి పోరాటం’ అని జగన్ అనలేదా!
  • మోదీని చూస్తే జగన్ కు వెన్నెముకలో వణుకు
  • జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉంది

‘ఢిల్లీకి, కడప పౌరుషానికి పోరాటం’ అంటూ నిన్నటి వరకూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన జగన్ ఎక్కడున్నాడని సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. కడప జిల్లా బద్వేలులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ, నరేంద్రమోదీని చూస్తే జగన్ కు వెన్నెముకలో వణుకు అని, తనను జైలుకు పంపిస్తారేమోనని భయమని విమర్శించారు. జగన్ జుట్టు కేసీఆర్ చేతిలో ఉందని, జగన్ కు అండగా ఉండే మరో నాయకుడు ఉన్నాడని, ఆయన ఢిల్లీలో ఉంటాడంటూ మోదీ పేరును ప్రస్తావించారు.

కేసీఆర్ పెద్ద నియంత అని, ఏపీపై దాడులు చేయాలనుకుంటున్నాడని ఆరోపించారు. నాడు కేసీఆర్ చేసిన పనులు ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయని విమర్శించారు. మన రాష్ట్రానికి రావాల్సిన లక్ష కోట్ల రూపాయలను అప్పనంగా తెలంగాణ కొట్టేసిందని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా అడ్డుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని, కృష్ణా నదీ జలాలను మన రాష్ట్రానికి ఇవ్వడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.

cuddapah
budvel
Telugudesam
campaign
Chandrababu
  • Loading...

More Telugu News