Anantapur District: హిందూపురంలో బాలకృష్ణ భార్య వసుంధర ఎన్నికల ప్రచారం

  • ఇంటింటికీ వెళ్లి మా ఆయనకు ఓటేయండని అభ్యర్థన
  • ప్రజల ఆదరణ బాగుంది 
  • గత ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీ ఖాయమంటున్న వసుంధర 

టీడీపీ అధినేత వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణ పోటీ చేస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ప్రచార బాధ్యతలను ఆయన భార్య వసుంధర స్వీకరించారు. భర్త తరపున ఆమె ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఆదివారం ఆమె ధర్మపురం తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టుపెట్టి తన భర్తకు ఓటేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాలకృష్ణగారు చేసిన అభివృద్ధిని ప్రజలు గుర్తించారని, చాలా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. గత ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మెజార్టీ కంటే ఈసారి అధిక మెజార్టీ వస్తుందన్న ఆశాభావాన్ని వసుంధర వ్యక్తం చేశారు.

Anantapur District
hindupur
Balakrishna
vasundhara
  • Loading...

More Telugu News