Telangana: ఇప్పటికే మూడుసార్లు ఓడించారుగా.. ఈసారి అయినా గెలిపించండి!: ఓటర్లకు కాంగ్రెస్ నేత రమేశ్ రాథోడ్ విజ్ఞప్తి

  • ఎన్నికల నేపథ్యంలో వినూత్న ప్రచారం
  • ఇంకెన్నిసార్లు ఓడిస్తారని ఓటర్లకు ప్రశ్న
  • ఆకట్టుకుంటున్న ప్రచారం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. బజ్జీలు వేస్తూ, బట్టలు ఇస్త్రీ చేస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. అయితే కొందరు నేతలు మాత్రం వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న రమేశ్ రాథోడ్ మాత్రం విభిన్నంగా ప్రచారం చేసుకుంటూ ముందుకెళుతున్నారు.

ప్రజలను కలసుకుంటూ..‘ఇప్పటికే నన్ను మూడుసార్లు ఓడించారు. ఇంకా ఎన్నిసార్లు ఓడిస్తారు? ఇప్పటికైనా నన్ను గెలిపించండి’ అని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. దీంతో ఈ ప్రచారం ప్రజలని ఆకట్టుకుంటోంది. 

Telangana
TRS
Congress
Adilabad District
loksabaha
campign
  • Loading...

More Telugu News