Visakhapatnam District: వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి ఓటమే లక్ష్యంగా పనిచేస్తా: మాజీ మంత్రి బాలరాజు

  • సీనియర్‌ నేతకు జగన్‌ కనీస గుర్తింపు ఇవ్వలేదు
  • సమన్వయ కర్తగా భాగ్యలక్ష్మి విఫలమయ్యారు
  • ఆమెకే టికెట్టు కేటాయింపు అన్యాయం

విశాఖ జిల్లా పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఓటమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి మత్సరాస బాలరాజు స్పష్టం చేశారు. పార్టీ అధినేత జగన్‌ శనివారం పాడేరులో పర్యటించిన సందర్భంగా పార్టీలో వర్గవిభేదాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బాలరాజు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ సమన్వయకర్తగా పూర్తిగా విఫలమైన భాగ్యలక్ష్మికి టికెట్టు కేటాయించడం దారుణమన్నారు.

పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నేతలు ఎంతోమంది ఉన్నా జగన్‌ ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడం అన్యాయమన్నారు. కనీస గుర్తింపులేని పార్టీలో ఉండడం అనవసరమనిపించి రాజీనామా చేశానని, తన సత్తా ఏంటో ఎన్నికల్లో చూపుతానని తెలిపారు. అధిష్ఠానం తనకు చేసిన అన్యాయానికి భాగ్యలక్ష్మి ఓటమితో బదులిస్తానని స్పష్టం చేశారు.

Visakhapatnam District
paderu
ex.minister balaraju
YSRCP
  • Loading...

More Telugu News