Telangana: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ.. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం!
- కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో మద్దతు
- మూడు స్థానాలపై తొలుత దృష్టి పెట్టిన టీడీపీ
- చంద్రబాబు ఆదేశాలతో నేతలు వెనక్కు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలు మరోసారి చేతులు కలిపాయి. ఇందులో భాగంగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయరాదని టీడీపీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీడీపీ చరిత్రలో తొలిసారి పోటీ నుంచి తప్పుకున్నట్లు అయింది. తెలంగాణలో పార్టీ కేడర్ ను కాపాడుకునేందుకు పోటీచేయాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కుంతియా టీటీడీపీ నేతలతో భేటీ అయ్యారు. దీంతో ఈ విషయాన్ని టీటీడీపీ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై పార్టీ ముఖ్యులతో చర్చించిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.
కాగా, తొలుత మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల నుంచి పోటీ చేయాలని టీడీపీ భావించింది. అయితే అధిష్ఠానం నిర్ణయం నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు అసంతృప్తికి గురయ్యారు.