Andhra Pradesh: ఓటేయండి పనిచేస్తా అని చెప్పడం లేదు.. మీకోసం పనిచేశాను, ఓటేయండని అడుగుతున్నా!: కోడెల శివప్రసాద్

  • సత్తెనపల్లిలో రూ.1,200 కోట్ల పనులు చేపట్టాం
  • ఈరోజు ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహణ
  • అభివృద్ధిని చూసి ఓటేయాలని కోడెల విజ్ఞప్తి

సత్తెనపల్లి నియోజకవర్గంలో గత ఐదేళ్లలో రూ.1,200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఏపీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తెలిపారు. నియోజకవర్గం ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే, ఈసారి మరింత అభివృద్ధి చేపడతామన్నారు. సత్తెనపల్లిలో ఈరోజు తారకరామ సాగర్ వాకింగ్ ట్రాక్ దగ్గర కోడెల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరారు. ఓటు చాలా బలమైన ఆయుధమనీ, ప్రజలంతా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ‘నాకు ఓటేయండి మీ కోసం పనిచేస్తా అని చెప్పడం లేదు. మీకోసం పనిచేశాను. కాబట్టి ఓటేయండి అని అడుగుతున్నా’ అని వ్యాఖ్యానించారు. టీడీపీని మరోసారి ఆశీర్వదించాలని సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు కోడెల శివప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

Andhra Pradesh
KODELA
sattenapalli
voters
campign
  • Loading...

More Telugu News