Vijayawada: ఐలాపురం హోటల్ 301లో కేఏ పాల్... ఉదయం నుంచి పోలీసుల తనిఖీలు!

  • విజయవాడలో బస చేసిన కేఏ పాల్
  • టికెట్లను అమ్ముకుంటున్నారని ఆరోపణలు
  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు

ప్రజాశాంతి పార్టీని పెట్టి, రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దిగిన క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్ బసచేసిన విజయవాడ, హోటల్ ఐలాపురంపై ఈ ఉదయం నుంచి పోలీసు దాడులు జరుగుతున్నాయి. కేఏ పాల్, హోటల్ లోని 301 నంబర్ రూమ్ లో బసచేసి వుండగా, బీ-ఫారాల జారీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారని అభియోగాలపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఆయన తన సహాయకుల నిమిత్తం అదే హోటల్ లో బుక్ చేసుకున్న రూముల్లో కూడా సోదాలు సాగుతున్నాయి. పార్టీ టికెట్ ఇచ్చేందుకు కేఏ పాల్ డబ్బులను వసూలు చేశారని పలువురు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై కొందరు బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్ కు స్వయంగా ఫిర్యాదు చేయడంతో వారు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Vijayawada
Prashanti Party
Police
Raids
  • Loading...

More Telugu News