TS SET: విడుదలైన 'తెలంగాణ సెట్' నోటిఫికేషన్

  • జులై 5, 6 తేదీల్లో పరీక్షలు
  • 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ
  • వెల్లడించిన ఉస్మానియా యూనివర్శిటీ

2019 సంవత్సరానికిగాను టీఎస్‌ సెట్‌ (తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌) నోటిఫికేషన్‌ ను ఉస్మానియా విశ్వ విద్యాలయం విడుదల చేసింది. టీఎస్ సెట్ లో భాగంగా మొత్తం 29 సబ్జెక్టులకు, జులై 5, 6వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని సెట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీ యాదవరాజు వెల్లడించారు. తొలిసారిగా ఈ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించనున్నామని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు రాయాలని భావించే అభ్యర్థులు ఈ నెల 27 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని తెలియజేశారు. పరీక్షలకు సంబంధించిన వివరాలు, దరఖాస్తు విధానాన్ని 'www.telanganaset.org', 'www.osmania.ac.in' వెబ్‌ సైట్లలో చూసి తెలుసుకోవచ్చని అన్నారు.

TS SET
Notification
Osmania University
  • Loading...

More Telugu News