Deve Gowda: తుముకూరు నుంచి బరిలోకి దిగుతున్న మాజీ ప్రధాని దేవెగౌడ

  • మనవడి కోసం హసన్ సీటును వదులుకున్న దేవెగౌడ
  • తుముకూరు సీటును జేడీఎస్‌కు కేటాయించడంపై కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అలక
  •  తాను కూడా బరిలోకి దిగుతానన్న ముద్దహనుమేగౌడ

మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ ఈ ఎన్నికల్లో తుముకూరు నుంచి బరిలోకి దిగుతున్నారు. శనివారం ఈ విషయాన్ని పార్టీ వెల్లడించింది. సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమానికి జేడీఎస్-కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నట్టు పేర్కొంది. దేవెగౌడ ప్రస్తుతం హసన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఆ సీటును వదులుకున్నారు.  

కాగా, హసన్ సీటును జేడీఎస్‌కు కేటాయించడంపై ఆ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఎస్‌పీ ముద్దహనుమేగౌడ గుర్రుగా ఉన్నారు. పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తాను కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. రెండు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు సహకరించేందుకు నిరాకరిస్తుండడంతో దేవెగౌడ పరిస్థితి సంకటంగా మారింది. మరోవైపు, ఇటీవల పార్టీని వీడి బీజేపీలో చేరిన మాజీమంత్రి ఎ.మంజు హసన్ నుంచి బరిలోకి దిగుతున్నారు.

Deve Gowda
Tumakuru
JDS
Prajwal Revanna
Hassan
Karnataka
Congress
  • Loading...

More Telugu News