Cricket: ఐపీఎల్ ఆరంభ వేడుకల ఖర్చు రూ.20 కోట్లు భద్రతా బలగాలకు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం
- ఓపెనింగ్ సెర్మనీ లేకుండానే లీగ్ ప్రారంభం
- వేడుకల ఖర్చు అంచనా వేసిన క్రికెట్ బోర్డు
- సింహభాగం ఆర్మీకి అందించాలని నిర్ణయం
ఇటీవలే జరిగిన పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్ ప్రారంభ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది. అయితే, ప్రారంభ వేడుకల ఖర్చు రూ.20 కోట్లుగా అంచనా వేసిన బీసీసీఐ ఆ మొత్తాన్ని భారత భద్రతా బలగాలకు విరాళంగా అందించాలని నిర్ణయం తీసుకుంది.
ఆ రూ.20 కోట్లలో ఆర్మీకి రూ.11 కోట్లు, సీఆర్పీఎఫ్ బలగాలకు రూ.7 కోట్లు, నేవీ, వాయుసేన బలగాలకు చెరో కోటి చొప్పున అందించేందుకు బోర్డు వర్గాలు తీర్మానించాయి. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఐపీఎల్ తాజా సీజన్ లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య చెన్నైలో ప్రారంభమైంది. చెన్నై జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.