kCR: కేసీఆర్‌ను చంద్రబాబు చాలా మిస్ అవుతున్నారు: ఎంపీ కవిత

  • రిటర్న్ గిఫ్ట్ విషయంలో చంద్రబాబుకు కంగారొద్దు
  • ఇవ్వాల్సిన సమయంలో కేసీఆర్ తప్పక ఇస్తారు
  • విమర్శలన్నింటిపై కేసీఆర్ తప్పక స్పందిస్తారు

ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయమై తొలిసారిగా టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. నేడు జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ రిటర్న్ గిఫ్ట్ విషయంలో చంద్రబాబుకు కంగారొద్దన్నారు. ఇవ్వాల్సిన సమయంలో కేసీఆర్ తప్పక ఇస్తారన్నారు. చంద్రబాబు, కేసీఆర్‌ను చాలా మిస్ అవుతున్నారని కవిత ఎద్దేవా చేశారు. చంద్రబాబు విమర్శలన్నింటిపై కేసీఆర్ తప్పక స్పందిస్తారని కవిత స్పష్టం చేశారు. తాము ఎవరినీ పట్టించుకోబోమని, తెలంగాణను దెబ్బతీసే వారిని మాత్రం వదలమన్నారు. ప్రస్తుతం తమకు తెలంగాణయే ముఖ్యమని కవిత పేర్కొన్నారు.

kCR
Chandrababu
Return Gift
Kavitha
Telangana
Jagityal
  • Loading...

More Telugu News