Bollywood: లోక్ సభ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు.. బీజేపీ అధిష్ఠానానికి ఈ విషయం ముందుగానే చెప్పా!: పరేశ్ రావల్

  • గతంలో అహ్మదాబాద్ ఈస్ట్ నుంచి విజయం
  • పోటీ చేయనని 4-5 నెలలకు ముందుగానే చెప్పా
  • వచ్చే నెల 11 నుంచి మే 19 వరకూ  పోలింగ్

మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, నటుడు పరేశ్ రావల్ కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానానికి 4-5 నెలల ముందే తెలియజేశానని పేర్కొన్నారు. అయితే పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పరేశ్ రావల్ గత లోక్ సభ ఎన్నికల్లో అహ్మదాబాద్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వచ్చే నెల 11 నుంచి మే 19 వరకూ లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం మే 23న ప్రకటించనుంది.

Bollywood
paresh rawal
BJP
loksabha
contest
  • Loading...

More Telugu News